కమిషన్‌ పెంచకపోతే నిరసన తప్పదు

0
68
గుమ్మళ్ళదొడ్డిలో ఐఓసిఎల్‌ డిపో ఎదుట పెట్రోల్‌ బంక్‌ డీలర్ల ఆందోళన
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 4 : అపూర్వచంద్ర కమిటీ సిఫార్సుల మేరకు పెట్రోల్‌బంక్‌ డీలర్ల కమిషన్‌ పెంచాలని, ఈ విషయంలో పెట్రోలియం సంస్థలు దిగి రాకపోతే నిరసన తప్పదని డీలర్లు హెచ్చరించారు. జిల్లా పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జగన్మోహనరెడ్డి, సత్యదేవ్‌, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డీలర్లు ఈరోజు గుమ్మళ్ళదొడ్డిలోని ఐఓసిఎల్‌ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం ముంబైలో చర్చలు జరుగుతున్నాయని, అవి సఫలీకృతం కాకుంటే రోజూ 8 గంటలు మాత్రమే బంక్‌లు పనిచేస్తాయని, సాధారణ సెలవుదినాల్లో బంక్‌లు పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించారు.