అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

0
117
ఎన్నికల ప్రచారంలో బొమ్మన
రాజమహేంద్రవరం, నవంబర్‌ 5 : జాంపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ను ప్రగతి పథంలో నడిపిస్తున్న తమకు అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని తిరిగి ఎన్నికల బరిలో ఉన్న ఆ బ్యాంక్‌ ప్రస్తుత చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌ కోరారు. రేపు జరగనున్న బ్యాంక్‌ పాలకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని బ్యాంక్‌ మెంబర్లను కలిసి ఓట్లు అభ్యర్ధించారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని, అవకాశమిస్తే చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను అందజేశారు. గత చరిత్ర చూసి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.   పలువురు డైరక్టర్‌ అభ్యర్ధులు బొమ్మన వెంట ఉన్నారు.