జనవరిలో చాంబర్‌ సప్తది వేడుకలు 

0
47
నందెపు శ్రీనివాస్‌ కన్వీనర్‌గా సావనీర్‌ కమిటీ
రాజమహేంద్రవరం, నవంబర్‌ 5 :  ప్రతిష్టాత్మకమైన ది రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ను స్థాపించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వచ్చే జనవరిలో సప్తది వేడుకను నిర్వహించాలని గత రాత్రి చాంబర్‌ భవనంలో జరిగిన పాలకవర్గ, కార్యవర్గసభ్యుల, అనుబంధ సంస్ధల అధ్యక్ష , కార్యదర్శుల సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి చాంబర్‌ అధ్యక్షులు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అధ్యక్షత వహించారు. సప్తది వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఈ సందర్భంగా ఓ సావనీర్‌ను వెలువరించాలని నిర్ణయించారు.  ఈ సావనీర్‌ కమిటీ కన్వీనర్‌గా జిల్లా ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ చైర్మన్‌, శ్రీ వెంకటేశ్వరా జనరల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నందెపు శ్రీనివాస్‌ను నియమిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. కాగా చాంబర్‌ సప్తది వేడుకలకు సీఎం చంద్రబాబునాయుడును,  ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ కన్వీనర్‌ అశోక్‌కుమార్‌ జైన్‌, చాంబర్‌ ఉపాధ్యక్షులు గ్రంధి వెంకటేశ్వరరావు, దొండపాటి సత్యంబాబు, గౌరవ సంయుక్త కార్యదర్శి వెత్సా వెంకట సుబ్రహ్మణ్యం( బాబ్జీ), చాంబర్‌ ట్రస్ట్‌బోర్డు డైరక్టర్‌ బత్తుల శ్రీరాములు, వలవల చిన్ని, కుడుపూడి వెంకట ప్రసాద్‌, పచ్చిగోళ్ళ వెంకట సూర్యనారాయణ, యక్కల వీర నాగేశ్వరరావు, పుచ్చల రామకృష్ణ, క్రొవ్విడి సాయికుమార్‌, వేమన సురేష్‌కుమార్‌, దొండపాటి ప్రవీణ్‌కుమార్‌, షేక్‌ చాన్‌ భాషా (సిటీకేబుల్‌  భాషా), చాంబర్‌ బులెటిన్‌ కమిటీ సభ్యులు దేవత సుధాకర్‌, చిన్ని శ్రీనివాసరావు, చాంబర్‌ డైరక్టర్లు తాడి వాసుదేవరావు, వివిఎస్‌ చలం, పేరూరి గంగాధరం, మలిరెడ్డి సత్యం పాల్గొన్నారు.