27 న వెలమ సంఘీయుల కార్తీక వన సమారాధన

0
122
రాజమహేంద్రవరం, నవంబర్‌ 5 : వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27న కార్తీక వనసమారాధన నిర్వహించను న్నారు. టి.నగర్‌లోని కోళ్ళ వీరాస్వామి  కళ్యాణ మండపంలో ఇరు సంఘాల ప్రతినిధులు సమావేశమై 27న శాటిలైట్‌సిటీలోని గొర్రెల వీర సూరి అప్పారావు తోటలో వెలమ సంఘీయుల కార్తీక వనసమారాధన నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ సమావేశానికి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు కోళ్ళ అచ్యుతరామారావు అధ్యక్షత వహించగా గౌరవ అధ్యక్షులు చల్లా శంకరరావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అల్లు బాబి, రెడ్డి బాబు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌, చలుమూరు శ్రీనివాస్‌, సప్పా ఉమా నాగేశ్వరరావు, వాసిరెడ్డి రాంబాబు, నెక్కల అప్పారావు పాల్గొన్నారు.