ప్రతి ఇంటిపై తెదేపా జెండాయే రెపరెపలాడాలి

0
95
3 వ డివిజన్‌లో జనచైతన్య యాత్రలో ప్రజాప్రతినిధులు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 5 : రాష్ట్ర విభజనతో ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి పధంలోకి తీసుకెళ్ళేందుకు కృషి చేస్తోందని పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళిమోహన్‌ అన్నారు. స్ధానిక 3 వ డివిజన్‌లో ఈరోజు నిర్వహించిన జనచైతన్య కార్యక్రమంలో ఎంపీ మురళిమోహన్‌తో పాటు రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీశేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు  హాజరయ్యారు. ముందుగా ఆర్ట్సు కళాశాల వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి ప్రతి ఇంటిపై తెదేపా జెండా ఎగిరేలా కృషి చేయాలని అన్నారు. సొంత గూడు లేని పేదలందరికి పక్కా గృహాలు అందేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు పడుతున్న కష్టంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతే రాష్ట్రాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. జన చైతన్య యాత్రల్లో ఆర్భాటాలకు పోకుండా కార్యకర్తలు పట్టుదలతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రన్న బీమాను కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, పార్టీ యువ  నాయకులు ఆదిరెడి ్డ వాసు, టిఎన్‌టియుసి జిల్లా  అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, స్ధానిక నాయకులు జక్కంపూడి శ్రీరంగనాయకులు, టేకుమూడి నాగేశ్వరరావు, బొమ్మనమైన శ్రీనివాస్‌, కుడుపూడి సత్తిబాబు, కార్పొరేటర్లు కోరుమిల్లి విజయశేఖర్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌, మానుపాటి తాతారావు, గరగ పార్వతి,  మళ్ళ నాగలక్ష్మీ, కో ఆప్షన్‌ సభ్యులు కప్పల వెలుగుకుమారి, మజ్జి పద్మ, పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, షేక్‌ సుభాన్‌, ఉప్పులూరి జానకిరామయ్య, సూరంపూడి  శ్రీహరి, మహబూబ్‌ జానీ, విశ్వనాథరాజు, మాలే విజయలక్ష్మీ, మళ్ళ వెంకట్రాజు, మాకాని లక్ష్మణరావు,మేరపురెడ్డి రామృష్ణ, గాడి శ్రీను, కంచిపాటి గోవింద్‌, వెలమ దుర్గా ప్రసాద్‌, వె లమ పద్మజ, జాగు వెంకటరమణ, దమరసింగ్‌ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.