తెలంగాణా సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం

0
55
రాజమహేంద్రవరం, నవంబర్‌ 6 : జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్యను తెలంగాణ ప్రభుత్వం నయీం కేసులో వేధించడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ బిసి విద్యార్ధి సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్‌లో తెలంగాణా సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర బిసి విద్యార్ధి సంక్షేమ సంఘం అధ్యక్షులు మరుకుర్తి దుర్గా యాదవ్‌ మాట్లాడతూ బిసిల పోరాట యోధుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్యను అక్రమంగా కేసులు పెట్టి వేధించడం సరైన విధానం కాదని, ఆయనను అరెస్ట్‌ చేస్తే బిసిల సత్తా తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. కక్ష సాధింపు చర్యలు మాని ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలని కోరారు.  కార్యక్రమంలో రాష్ట్ర బిసి సంఘం కార్యదర్శి గంగుల సూర్యారావు, జిల్లా బిసి సంఘం ఉపాధ్యక్షులు దొమ్మేటి శంకరరావు, యిమంది కన్నారావు, నగర అధ్యక్షుడు దీపు, మురళీ యాదవ్‌, ప్రసాద్‌ యాదవ్‌, మేకల కిషోర్‌, యాదవ్‌, రవి, రాజు, జయశ్రీ పాల్గొన్నారు.