ఘనంగా  బొమ్మన రామచంద్రరావు వర్థంతి 

0
43
రాజమహేంద్రవరం, నవంబర్‌ 6 : రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం దివంగత గౌరవ అధ్యక్షులు  బొమ్మన రామచంద్రరావు 12వ వర్థంతి కార్యక్రమం రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక జాంపేట, గాంధీబొమ్మ సెంటరులో గల ఆయన కాంస్య విగ్రహంవద్ద ఘనంగా జరిగింది. తొలుత ఆయన తనయుడు, సంఘ అధ్యక్షులు   బొమ్మన రాజ్‌కుమార్‌ ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తర్వాత రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి  కాలెపు సత్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు బీరా శ్యామలరావు, కార్యర్శులు గంపా సోమలింగేశ్వరరావు (బాబు),  కనకం అమర్‌నాథ్‌, సహాయ కార్యదర్శి చింతా వెంకట చలపతిరావు, ది రాజమండ్రి ¬ల్‌సేల్‌ క్లాత్‌ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు  బిళ్ళా రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణమూర్తి  మాట్లాడుతూ  బొమ్మన సంఘీయుల పురోభివృద్ధికై చేసిన సేవలను కొనియాడారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంఘం సహాయ కోశాధికారి  బళ్ళ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు   పడాల సూర్య కోటేశ్వరరావు,  చప్పటి సత్యనారాయణ,  అల్లక సత్యనారాయణ (సాంబం),  బత్తుల కేదారీశ్వరరావు (ఈశ్వరరావు),  కుందుం కరుణాకర్‌,  బళ్ళా శ్రీనివాసరావు (మయూరి శ్రీను), చింతల చిన్ని,  గోరు వీరభద్రరావు,  కాలెపు వెంకట వీరభద్రరావు,  బీరా పద్మనాభ అప్పారావు, డా|| బళ్ళా శ్రీనివాసరావు,  ఆశపు సోమశేఖరరావు, అల్లంకి కోటేశ్వరరావు,   కొండపల్లి గణేశ్వరరావు (గణేష్‌) తదితరులు పాల్గొన్నారు.