‘రాజమహేంద్రి’లో వక్తృత్వ పోటీలు 

0
53
రాజమహేంద్రవరం, నవంబర్‌ 6 : రాజమహేంద్రి మహిళా, డిగ్రీ అండ్‌ పిజి కళాశాలలో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కమిషన్‌ నిర్వహించిన విజిలెన్స్‌ ఎవేర్‌నెస్‌ వీక్‌ ఎలక్యూషన్‌ కాంపిటీషన్‌ నిర్వహించారు. దీనిలో రోల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎటైనింగ్‌ ఎ కరప్షన్‌ ఫ్రీ సొసైటీ అనే అంశంపై ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషలలో వక్తృత్వ పోటీ జరిగింది. ప్రస్తుతం మన దేశంలో అవినీతి ఎక్కువగా ఉందని, దీనిని అరికడితే  నవ సమాజం ఏర్పడుతుందని ఉద్బోధించారు. అవినీతి వల్ల చాలామంది నష్టపోతున్నారని, దీని వలన దేశ ప్రగతి రానురాను కుంటుపడుతోందని విద్యార్ధినులు వివరించారు. ఈ సందర్భంగా గెలిచిన విద్యార్ధినులకు ఓఎన్‌జిసి బేస్‌ కాంప్లెక్స్‌లో గోదావరి భవన్‌లో బహుమతి ప్రదానం జరిగింది. వివిధ భాషలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్ధినులు పి.ఎస్‌.ఎల్‌.శ్రావణి, జి.డి.ఎస్‌.ఎస్‌.వినయప్రభ, ఎం.శాంతిప్రియ, హీనా మొబీన్‌, పూజాకుమారి యాదవ్‌, వి.ఎస్‌.ఎస్‌.జె.ఎస్‌.ఎల్‌.మౌనిక, జి.భవాని, కె.నందిని, అఖిలా హర్షిణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ టి.కె.విశ్వేశ్వరరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ డా.నాళం రజని, విజేతలైన విద్యార్ధినులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విధంగా విద్యార్ధినులు మంచి మంచి బహుమతులు వివిధ రంగాలలో సాధించాలని, దీని వలన ప్రగతి ముందు బాటలో నడుస్తోందని కళాశాల సెక్రటరీ, ప్రిన్సిపాల్‌ విద్యార్ధినులందరినీ అభినందించారు.