ప్రశాంతంగా జాంపేట బ్యాంక్‌ పాలకవర్గ ఎన్నికలు 

0
57
రాజమహేంద్రవరం, నవంబర్‌ 6 : జాంపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ పాలకవర్గ ఎన్నికలు ఈరోజు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. బైపాస్‌ రోడ్డులోని  దానవాయిపేట మున్సిపల్‌ హైస్కూల్‌లో ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 12 డైరక్టర్‌ స్ధానాలకు 31 మంది పోటీలో ఉన్నారు. బ్యాంక్‌లో మొత్తం 17,721 మంది ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది.  పోలింగ్‌ ముగిశాక ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రస్తుత చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌ ప్యానెల్‌తో పాటు మాజీ చైర్మన్‌ ద్వారా ఆనంద్‌ మరో బెల్ట్‌గా ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. బొమ్మన ప్యానెల్‌లో కనకం అమరనాధ్‌, రొబ్బి విజయశేఖర్‌, మహంతి లక్ష్మణరావు, శీలా రఘబాబు, సేపేని రమణమ్మ, కాలెపు సత్యనారాయణమూర్తి, కొమ్మన వెంకటేశ్వరరావు, జామిశెట్టి గాంధీ, ద్వారా పార్వతి సుందరి, ప్రసాదుల హరనాథ్‌, ముప్పన శ్రీనివాస్‌ పోటీ పడుతుండగా ఆనంద్‌ ప్యానెల్‌లో అల్లాడ అప్పలరాజు, అల్లాడ శ్యామల, ఆశపు శేఖర్‌, కటకం మల్లికార్జునరావు, కంకిపాటి ఉమా మహేశ్వరి, గుంటముక్కల ప్రసాద్‌, చింతా చలపతిరావు, బత్తుల శేఖర్‌, బళ్ళా శ్రీనివాసరావు, బీరా శ్రీనివాసరావు, వట్టం షణ్ముఖరావు పోటీలో ఉన్నారు.  ఈ ప్యానెళ్ళలో ఉన్న వారు గాక ఇతరులు ఏడుగురు స్వతంత్రంగా పోటీలో ఉన్నారు. పోలింగ్‌ను ఎన్నికల అధికారి త్రిమూర్తులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్‌ సందర్భంగా డిఎంహెచ్‌ స్కూల్‌ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఓట్ల లెక్కింపు అక్కడే నిర్వహించనున్నారు. ఎన్నికైన డైరక్టర్లు రేపు ఉదయం సమావేశమై తమలో ఒకరిని చైర్మన్‌గా, వైస్‌ చైర్మన్‌గా  ఎన్నుకుంటారు.