పేదలపక్షం తెదేపా ప్రభుత్వం 

0
194
35, 5 డివిజన్లలో జన చైతన్య యాత్రలు
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 8 : రాష్ట్రంలో పేదల పక్షాన తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, పేదల అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారని, నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు 35వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కరగాని మాధవి, 5వ డివిజన్‌లో పార్టీ నాయకులు తలారి భగవాన్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్ళి తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ఆదర్శవంతమైన పాలన జరుగుతోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను  అర్హులకు చేరువ చేయడంలో తెదేపా శ్రేణులు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, చీప్‌ విప్‌ పాలిక శ్రీను, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, యార్లగడ్డ శేఖర్‌, కార్పొరేటర్లు కోరుమిల్లి విజయశేఖర్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌, ద్వారా పార్వతి సుందరి, పెనుగొండ విజయభారతి, మహబూబ్‌ జాని, సూరంపూడి శ్రీహరి, కరగాని వేణు, మంత్రమూర్తి రాంబాబు, కప్పల వెలుగుకుమారి, మజ్జి పద్మ, వెలమ పద్మజ, తదితరులు పాల్గొన్నారు.