అగ్నిప్రమాద బాధితులకు దుప్పట్లు పంపిణీ 

0
40
రాజమహేంద్రవరం, నవంబర్‌ 9 :  కొంతమూరు జంగాల కాలనీలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో బాధితులకు స్రవంతి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో  ఇంటికి మూడేసి చొప్పున దుప్పట్లు పంపిణీ చేశారు. స్రవంతి నిర్వాహకులు, డిసిసి అధ్యక్షులు కందుల దుర్గేష్‌ చేతులమీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ రాయుడు సతీష్‌, చిక్కాల బాబులు, ఎన్‌.వి.శ్రీనివాస్‌, బోడా వెంకట్‌, దాసి వెంకట్రావు, ఎస్‌.ఎ.కె.అర్షద్‌ తదితరులు పాల్గొన్నారు.