మోడీ నిర్ణయం విప్లవాత్మకం : ఎమ్మెల్యే ఆకుల 

0
60
రాజమహేంద్రవరం, నవంబర్‌ 9 : దేశ ఆర్ధిక వ్యవస్ధను ప్రక్షాళన చేసి నల్లధనాన్ని, ఉగ్రవాదులకు అందుతున్న నకిలీ కరెన్సీని, మాదక ద్రవ్య వ్యాపారులు వినియోగిస్తున్న అక్రమ లావాదేవీలను నిరోధించడానికే ప్రధాని మోడీ రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. మోడీ చర్యలు త్వరలోనే సత్ఫలితాలు ఇస్తాయన్నారు. ముఖ్యంగా పన్ను ఎగవేతదార్లకు ఈ నిర్ణయం గొడ్డలి పెట్టువంటిదన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతానికి ఈ నిర్ణయం దోహ దపడుతుందన్నారు.