ట్రంప్‌దే శ్వేతసౌధం

0
52
వాషింగ్టన్‌, నవంబర్‌ 9 : అగ్ర రాజ్యం అమెరికా కొత్త అధ్యక్షునిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు. తన సమీప అభ్యర్ధి, డెమోక్రటిక్‌ పార్టీ  అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌పై ఆయన విజయం సాధించారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికల్లో ఈ ఇరువురు నువ్వా…నేనా అన్నట్లు ప్రచారం సాగించినా  చివరకు విజయం ట్రంప్‌ను వరించింది. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా పదవీ కాలం ముగియనుండటంతో నిన్న నిర్వహించిన పోలింగ్‌లో అభ్యర్ధులిద్దరు ¬రా¬రీగా తలపడ్డారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఇద్దరు సమాన స్థాయిలో ఉండటంతో విజయం ఎవరిని వరిస్తుందోనని యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో ట్రంప్‌ విజేతగా నిలిచారు.