ప్రజల కోసం తెలుగుదేశం

0
72
రాజమహేంద్రవరం, నవంబర్‌ 11 : ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, దివంగత ఎన్‌.టి.రామారావు ఆశయ సాధన కోసం సీఎం చంద్రబాబునాయుడు  అహర్నిశలు శ్రమిస్తున్నారని పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ అన్నారు. ఈరోజు 8, 17 డివిజన్లలో జరిగిన జనచైతన్య యాత్రలో మురళీమోహన్‌తో పాటు రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ,  ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయడు, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, ఆదిరెడ్డి వాసు, మజ్జి రాంబాబు, యేలూరి వెంకటేశ్వరరావు,  ఉప్పులూరి జానకిరామయ్య, కొమ్మ శ్రీనివాస్‌, కోరిమిల్లి విజయ్‌శేఖర్‌, విశ్వనాధరాజు తదితరులు పాల్గొన్నారు.