గన్ని కృష్ణ సారధ్యంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ  

0
154
రాజమహేంద్రవరం, నవంబర్‌ 11 : స్ధానిక శ్రీరామనగర్‌లోని శ్రీ సంకట హరవర సిద్ధి వినాయక ఆలయంలో అయ్యప్ప స్వామి పడి పూజ మ¬త్సవం అత్యంత ఘనంగా జరిగింది. అయ్యప్ప దీక్షలో ఉన్న తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పడి పూజకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  చలపతి గురుస్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కడు శ్రావ్యంగా అయ్యప్పను కీర్తిస్తూ భావోద్వేగంతో పాడిన పాటలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, రూరల్‌ తెదేపా నాయకులు గంగిన హనుమంతరావు, న్యాయవాది డోకల అప్పారావు, మార్ని సురేష్‌, రెడ్డి మణి, కురగంటి సతీష్‌, పెండ్యాల రామకృష్ణ, నిమ్మలపూడి గోవింద్‌, బీవిఎం మురళి, చాన్‌ భాషా, హుస్సేన్‌ ఆలీ జానీ, కొత్తూరి బాల నాగేశ్వరరావు, కెఎస్‌ ప్రకాశరావు, మళ్ళ వెంకట్రాజు, మజ్జి రాంబాబు, ఉప ్పులూరి జానకిరామయ్య, కోట కామరాజు, సెనివాడ అర్జున్‌,మహేష్‌, జయవర్ధన్‌, జీవ, మర్రి గిరీష్‌, వంశీ, ఆలయ అర్చకులు మురళి, రాజు  తదితరులు పాల్గొన్నారు.