అడుగు..అడుగు…వేద్దాం

0
75
కాపు సత్యాగ్రహ యాత్రను విజయవంతం చేద్దాం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 11 : కాపులను బిసీ జాబితలో చేర్చాలన్న నినాదంతో రావులపాలెం నుంచి అంతర్వేది వరకు మాజీ మంత్రి, కాపు జెఎసీ నేత ముద్రగడ పద్మనాభం చేపడుతున్న కాపు సత్యాగ్రహ యాత్రకు కాపు సోదరులు తరలిరావాలని కాపు నేతలు పిలుపు ఇచ్చారు. జక్కంపూడ గణేష్‌ ఆధ్వర్యంలో ఈరోజు వైఎంవిఏ హాలులో కాపు సోదరుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కాపు జెఏపీ నేత వాసిరెడ్డి ఏసుదాసు, మాజీ  ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు , మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, వైకాపా సీజీసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ. కాపు సంఘంనాయకులు ఆకుల వీర్రాజు, రామినీడి మురళి, జిల్లా వర్తక ఫెడరేషన్‌ చైర్మన్‌ నందెపు శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. ముద్రగడ పాదయాత్రకు సంధించిన గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తొక్కుల రామాంజనేయులు,అల్లూరి శేషునారాయణ, బొంత శ్రీహరి, కొత్తపేట రాజా, సూరవరపు రామారావు, మానే దొంబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్‌,మేడిశెట్టి కృష్ణారావు,ఎన్‌ఎస్‌యుఐ సందీప్‌, మాలే విజయలక్ష్మీ, మంచాల బాబ్జీ,కొల్లిమళ్ళ రఘ, డబ్బింగ్‌ శ్రీను,చామకూర శ్రీనివాసరావు, నిడిగట్ల బాబ్జీ, దూలం ప్రసాద్‌, పేపకాయల విష్ణు, మెట్ల ఏసుపాదం, చిక్కాల బాబులు తదితరులు పాల్గొన్నారు.