నెహ్రూనగర్‌ పాఠశాలలో బాలల దినోత్సవం

0
70
రాజమహేంద్రవరం, నవంబర్‌ 14 : స్థానిక నెహ్రూనగర్‌ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు నెహ్రూ జయంతి సందర్భంగా  బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిధిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు క్రికెట్‌ కిట్‌లు, ఇంగ్లీషు డిక్షనరీలు, పెన్సిల్‌ బాక్స్‌లు, క్రెయాన్స్‌, ఇతర వస్తువులను షర్మిలారెడ్డి చేతులమీదుగా అందజేశారు. ప్రధానమంత్రిగా పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన సేవలను ఆమె వివరించారు.