గ్రంథాలయాల్ని పరిరక్షించుకోవాలి 

0
26
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 15 :  విజ్ఞానాన్ని పెంపొందించే  గ్రంథాలయాలను పరిరక్షించుకోవాలని ఇన్నీస్‌పేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ కోళ్ళ అచ్యుతరామారావు పిలుపు ఇచ్చారు. ఇన్నీస్‌పేటలోని శాఖా గ్రంథాలయంలో 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.  21 వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొమ్మ శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అచ్యుత రామారావు మాట్లాడారు. శివరామ కలర్‌ ల్యాబ్‌ అధినేత సత్యవరపు గోకులమురళి మాట్లాడుతూ గ్రంథాలయాల విశిష్టతను భావితరాలకు తెలియజేయాలన్నారు.  నిమ్మలపూడి  గోవింద్‌ మాట్లాడుతూ  బాలబాలికలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలుగు పండిట్‌ పివిఎల్‌ఎన్‌ఎస్‌ శాస్త్రి మాట్లాడుతూ పుస్తకాలు వ్యక్తిత్వ వికాశానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠకులు బి.బంగార్రాజు, జి.సురేష్‌, బి.మణికంఠ పర్యవేక్షించారు. గ్రంథాలయాధికారిణి పి.శ్రీదేవి వందన సమర్పణ చేశారు.