ద్విచక్ర వాహనంపై గోరంట్ల సుడిగాలి పర్యటన

0
134
రాజమహేంద్రవరం, నవంబర్‌ 15 : హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని డి-బ్లాకులో జరుగుతున్న అభివృద్ధి పనులను రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఈరోజు పరిశీలించారు. అయితే ఎప్పటిలాగే కారులో వెళ్ళకుండా ద్విచక్ర వాహనంపై వెళ్ళి పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. డి-బ్లాకులో రూ.1.4 కోట్లతో చేపట్టిన 36 సిసి రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. గోరంట్ల ద్విచక్ర వాహనంపై పర్యటించడంతో ఆ గ్రామ ప్రజలు, అధికారులు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఆయన వెంట వెళ్ళేందుకు ఆత్రుత పడ్డారు.