18న భారత్‌ కో జోన్‌ పోటీలు 

0
84
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 15 : భారత్‌ వికాస్‌ పరిషత్‌ రాజమండ్రి శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 18న మధ్యాహ్నాం 1.30 గంటలకు గౌతమీ ప్రాంతీయ గ్రంథా లయంలో  భారత్‌ కో జానో ప్రశ్నల పోటీలు జరగనున్నాయని పోటీల కన్వీనర్‌ డా.ఎస్‌. రవిచంద్ర తెలిపారు. పోటీలు జూనియర్స్‌ విభాగం (6 నుంచి 8 తరగతి), సీనియర్స్‌ విభాగం (9 నుంచి 12 వ తర గతి)లో పోటీలు జరుగుతాయని, పాఠ శాలల యాజమాన్యాలు విద్యార్ధులను పంపి సహ కరించాలని ఆయన కోరారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయ, సాహిత్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి తెలుసు కుని జాతీయ భావాలు కలిగిన ఉత్తమ పౌరులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.