ప్రజలకు అండగా చంద్రన్న పధకాలు

0
87
జన చైతన్య యాత్రలో ఎమ్మెల్యే గోరంట్ల 
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 15 : రాష్ట్రంలోని పేద ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక పధకాలను అమలుచేస్తున్నారని రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా నేడు స్ధానిక 10వ డివిజన్‌లో ఆ వార్డు కార్పొరేటర్‌, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు ఆధ్వర్యంలో నాయకులు వార్డులోని ప్రజలను కలుసుకుని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా కోత పెట్టలదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా చెప్పని వాటిని కూడా చంద్రబాబు అమలు చేస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవుల పండుగలకు చంద్రన్న కానుకలను అందజేస్తున్నారన్నారు. చంద్రన్న బీమా పధకం ద్వారా పేద వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తూనే ఇంకా ప్రజల అవసరాలు ఏమిటనేది తెలుసుకోవడం కోసం జనచైతన్య యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. గృహాలు లేని పార్టీ కార్యకర్తలకు గృహాలు కల్పిస్తామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రాన్ని విభజించిన వారే ఇప్పుడు ¬దా అంటూ వస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష వైసిపికి అవేమీ కన్పించడం లేదన్నారు. అభివృద్ధిని అడ్డుకునే విధ్వంసక పార్టీ వైసిపి అన్నారు. రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వడం ఆ పార్టీకి రాదన్నారు. పదేళ్ళ కాలంలో దోచుకొని జైలుకువెళ్ళొచ్చిన నేత నడుపుతున్న పార్టీలో దోపిడీ దారులే ఉన్నారని ఆరోపించారు. వైసిపి వంటి అవినీతి పార్టీకి తగిన గుణపాటం చెప్పాలన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని, చంద్రబాబు ఉన్నంతకాలం రాష్ట్రంలో సువర్ణ అధ్యాయమేనన్నారు. ఈ సందర్భంగా డివిజన్‌లో ఇంటింటికి వెళ్ళి టిడిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఫ్లోర్‌లీడర్‌ వర్రే శ్రీనివాస్‌,దళితరత్న , కాశి నవీన్‌కుమార్‌, ఛీప్‌విప్‌ పాలిక శ్రీను, కార్పొరేటర్‌లు కడలి రామకృష్ణ, మర్రి దుర్గా శ్రీనివాసరావు, బెజవాడ రాజ్‌కుమార్‌, కోఆప్సన్‌ సభ్యులు మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, టిడిపి నాయకులు ఆదిరెడ్డి వాసు, యేలూరి వెంకటేశ్వరరావు, వెలమ దుర్గాప్రసాద్‌, వాసిరెడ్డి బాబి, మేరపురెడ్డి రామకృష్ణ, జక్కంపూడి అర్జున్‌, దమరసింగ్‌ బ్రహ్మాజీ, బల్లంకుల రాజు, కంచుపాటి గోవింద్‌, తంగేటి సాయి, మహబూబ్‌ జానీ తదితరులు పాల్గొన్నారు.