ఎన్‌ఎంసి యాక్ట్‌ను ఉపసంహరించుకోవాలి

0
63
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఐఎంఏ వైద్యుల ధర్నా
రాజమహేంద్రవరం, నవంబర్‌ 16 : వైద్య వృత్తి స్వాతంత్య్రాన్ని హరించే ఎన్‌ఎంసి యాక్ట్‌ను ఉపసంహరించుకోవాలని, వైద్యులు, వైద్య సంస్థలపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టేందుకు చట్టం రూపొందించాలని కోరుతూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నగరశాఖ ఆధ్వర్యంలో ఈరోజు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు  వైద్యులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నగరశాఖ అధ్యక్షులు డాక్టర్‌ వేలూరి రామచంద్ర, డాక్టర్‌ వై.ఎస్‌.గురుప్రసాద్‌ మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలకు సవరణ చేసి నష్ట పరిహారాన్ని నిర్ధారించాలని, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ నుంచి  సింగిల్‌ డాక్టర్‌ సంస్థలను మినహాయించాలని, పిసిపిఎన్‌డిటి యాక్ట్‌ సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు.  వైద్యుల ఆందోళనకు ఎపి మెడికల్‌ రిప్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అక్కడకు చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కేశవస్వామి, రామరాజు, పెరుమాళ్ళు, కర్రి రామారెడ్డి, జోగారావు, గూడూరి శ్రీనివాస్‌, క్రొవ్విడి రాజేష్‌, కంటే వీరన్నచౌదరి, ఆకుల సత్యనారాయణ, బోడపాటి శ్రీనివాస్‌, చలుమూరు తులసీ మోహనరావు, వట్టి గంగా కిషోర్‌, దుద్దుకూరి రామారావు, కురుకూరి విజయకుమార్‌, శాంతారామ్‌, విఠల్‌బాబు, పార్థసారధి, రామ్‌గోపాల్‌రెడ్డి, కె.శ్రీనివాస్‌, గంపా వీరభద్రస్వామి, కందుల సాయి, నేమాని, భాస్కరచౌదరి, గంగా అనంతలక్ష్మి, పి.సునీత, సజ్జా  శరత్‌కుమార్‌, సజ్జా పద్మ తదితరులు పాల్గొన్నారు.