ముస్లిమ్‌ల సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్యం

0
40
రాజమహేంద్రవరం, నవంబర్‌ 17 :  ముస్లిమ్‌ల సంక్షేమ విషయంలో అధికారుల సహకారం లభించడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్‌ ఖాశిం ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జాంపేట సెంటర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల వైఖరి వల్ల ముస్లిమ్‌లు అనేక అవస్ధలు పడుతున్నారన్నారు. రుణాలు, ఫించన్లు, రేషన్‌ కార్డులు తదితర సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు ఇబ్బందులను సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై ఖాశిం స్పందించి  ఈ సమస్యలన్నింటిని కలెక్టర్లతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల కమిటీల సభ్యులు,అర్బన్‌, రూరల్‌ కమిటీల సభ్యులు, రాష్ట్ర కమిటీ సెక్రటరీ సయ్యద్‌ మక్భూల్‌, అక్బర్‌భాషా, షేక్‌ కరీముల్లా, షేక్‌ వలీ, షేక్‌ బషీర్‌, షేక్‌ జిలానీ, షేక్‌  షరీఫ్‌,షేక్‌ రఫీ, షేక్‌ హుస్సేన్‌, సయ్య ద్‌ బాజీ, షేక్‌ మొయినుద్దీన్‌ పాల్గొన్నారు.