ఆదుకున్నారు…అండగా ఉందాం

0
149
దళితులకు కాశి నవీన్‌కుమార్‌ పిలుపు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 18 : ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే దళితుల సంక్షేమం సాధ్యమవుతుందని తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు దళితరత్న కాశి నవీన్‌కుమార్‌  ఒక ప్రకటనలో అన్నారు. ఓ వైపు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ మరో వైపు నవ్యాంధ్ర రాజధానిని నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో నిర్మించేందుకు కృషి చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబు దళితులకు ఎవరూ రూపకల్పన చేయని అనేక పథకాలను వర్తింపజేసి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారన్నారు.  దళిత విద్యార్ధులకు మెరుగైన విద్యా ఉపాధి అవకాశాలు విదేశీ విద్య, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు, ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దళిత గిరిజనుల అభివృద్ధికి కేటాయిస్తున్నారన్నారు. దళిత వాడల్లో సీసీ రోడ్లు,డ్రైనేజీ, సురక్షితమైన త్రాగునీరు అందించడం వంటి కార్యక్రమాలు పోటీ పరీక్షల్లో దళిత విద్యార్ధులకు స్టడీ మెటిరియల్స్‌ ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. వృత్తి విద్యా శిక్షణ ద్వారా ఉపాధి కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను సీఎం అమలు చేస్తున్నారని నవీన్‌కుమార్‌ అన్నారు. దళిత, గిరిజన అభ్యున్నతి వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబుకు ఈ సామాజిక వర్గీయులంతా అండగా నిలవాలని నవీన్‌కుమార్‌ కోరారు.