ఉత్తమ యూనివర్శిటీగా తీర్చిదిద్దుతాం

0
39
‘నన్నయ’లో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 20 :ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా, ఉత్తమ వర్శిటీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాజానగరం సమీపంలో నన్నయ విశ్వ విద్యాలయంలో గత రాత్రి రూ. 20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి విద్యార్ధులను ఉద్ధేశించి మాట్లాడారు. విద్యార్ధులకు రాయితీపై  ట్యాబ్‌లు ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. నిరుద్యోగులను ఆదుకోవడానికి, ఉపాధి ప్రాధాన్యం కోసం త్వరలో ఒక పథకం ప్రవేశపెడతామన్నారు. యూనివర్శిటీ ప్రాంగణంలో  కొత్తగా నిర్మించిన అంబేద్కర్‌ సెంట్రల్‌ గ్రంథాలయం, ఇంజనీరింగ్‌ కళాశాల, మహిళా వసతి గృహాల భవనాలను చంద్రబాబు ప్రారంభించారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనానికి అడ్డుకట్ట పడుతుందని, అయితే రూ. 2 వేల నోటు రద్దు వల్ల తిరిగి నల్లధనం పెరిగిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాంకేతిక ఇబ్బందులు ఉందని, ఈ విషయం తెలిసి కూడా కొంతమంది
రాజకీయ దురుద్ధేశ్యంతో విద్యార్ధులను, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ ముత్యాల నాయుడు, రిజిస్ట్రార్‌ ఎ.నరసింహరావు పాల్గొన్నారు.