యూపీలో ఘోర రైలు ప్రమాదం : 96 మంది దుర్మరణం

0
64
న్యూఢిల్లీ, నవంబర్‌ 20 : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహత్‌ జిల్లా పుఖరాయ్‌ వద్ద ఈ తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 96 మంది దుర్మరణం చెందారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. ఇండోర్‌ నుంచి పట్నా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌కు  చెందిన 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘోరం సంభవించింది. ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉండగా ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ బోగీలు మొత్తం 14 పట్టాలు తప్పడంతో సంఘటనా స్ధలంలోనే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు ఆసుపత్రిలో కన్నుమూశారు.  ఈ దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రకటించారు. యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.