నీ ప్రాపకం కోసం దళితుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టొదు

0
93
కారెం శివాజీకి మాజీ ఎంపి హర్షకుమార్‌ సూచన
రాజమహేంద్రవరం, నవంబర్‌ 22 : పదవుల కోసం దళితుల ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టొద్దని కారెం శివాజీకి  మాజీ ఎంపి జివి హర్షకుమార్‌ సూచించారు.  నేడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్‌ మాట్లాడుతూ తనపై అంబేద్కర్‌ విగ్రహం కూల్చిన కేసు ఉందంటూ శివాజీ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.  తనపై అటువంటి కేసు ఏమీ లేదని, గతంలో శివాజీ నిరాహార దీక్ష చేసినప్పుడు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేస్తే వారిని విడిపించడానికి వెళ్ళగా, పరుషంగా మాట్లాడినట్లు తనపై కేసుపెట్టారని, ఈ కేసులో తనకు 6నెలలు జైలు శిక్ష పడిందన్నారు. ఎస్సీఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా శివాజీ ఆ వర్గాలకు చేసిన మేలు ఏమిటని ప్రశ్నించారు.  పదవులు కోసం వేదికలపైనే కాళ్ళు పట్టుకుని మాలల ఆత్మగౌవరాన్ని తాకట్టుపెట్టడం సరికాదన్నారు. దళితుల సింహగర్జన నిర్వహించి వారి ఆత్మగౌరవాన్ని నిలిపింది తానేనన్నారు. అంబేద్కర్‌ విగ్రహాలను జైలులో ఉంచినట్లు పంచాయితీ కార్యాలయాల్లో ఉంచారని దీనిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సభకు 6వేల మందే వచ్చారని ఇంటిలిజెన్స్‌ నివేదికలు చెబుతున్నాయన్నారు. జగన్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.  దళితులు ఎప్పుడూ టిడిపికి వ్యతిరేకంగానే ఉంటారన్నారు. దళిత, గిరిజన మహాగర్జనలో చంద్రబాబు ప్రకటించిన వరాల్లో చిత్తశుద్ది లేదన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ ¬దా కల్పించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోనే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తీర్మానం చేసి పంపారని గుర్తుచేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బిజెపిని ఒప్పించి దళిత క్రైస్తవులకు ఎస్సీ ¬దా కల్పించాలన్నారు.  క్రైస్తవ స్మశాన వాటికలకు స్ధలాలు కేటాయించాలని గత రెండున్నరేళ్ళగా తాము డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మాలమహానాడు నాయకులు యర్రా రామకృష్ణ మాట్లాడుతూ లక్షలాది మంది మాలలు తనవెనక ఉన్నారని చెప్పుకొనే కారెం శివాజీ చంద్రబాబు కాళ్ళు ఎందుకు పట్టుకున్నారని ప్రశ్నించారు. ఎస్సీఎస్టీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు బేతాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హర్షకుమార్‌ సహకారంతో ఎదిగిన శివాజీ ఇప్పుడు ఆయన్నే విమర్శించడం తగదన్నారు.  విలేకరుల సమావేశంలో జివి శ్రీరాజ్‌, వరిగేటి కిరణ్‌కుమార్‌, శీతల్‌, పీతల జయబాబు పాల్గొన్నారు