మూగబోయిన గళం

0
73
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాల మురళీకృష్ణ కన్నుమూత
రాజమహేంద్రవరం, నవంబర్‌ 22 : ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీత డాక్టర్‌ మంగళంపల్లి బాల మురళీకృష్ణ ఈ సాయంత్రం చెన్నైలో కన్ను మూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1930 జులై 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని శంకరగుప్తం గ్రామంలో జన్మించిన బాల మురళీకృష్ణ కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టారు. ప్రపంచవ్యాప్తంగా 25వేల సంగీత కచేరీలు చేసి ఒక రికార్డు సృష్టించిన బాల మురళీకృష్ణకు గోదావరి తీరంతో ముఖ్యంగా రాజమహేంద్రవరంతో అవినాభావ సంబంధం ఉంది. గోదావరి గట్టున జరిగే త్యాగరాజ నారాయణదాస సేవా సమితి సంగీత వార్షికోత్సవాల్లో గతంలో ఎన్నో కచేరీలు చేసిన బాల మురళీకృష్ణ సంగీత ప్రియులను శోక సంద్రంలో ముంచి దివి కేగారు. గతంలో ఆయనకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పౌర సన్మానం కూడా నిర్వహించింది.