నగర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి 

0
48
రాజమహేంద్రవరం, నవంబర్‌ 24 :  స్థానిక వై-జంక్షన్‌లో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి భక్త్యంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌.వి.శ్రీనివాస్‌, పిసిసి ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బెజవాడ రంగారావు, పిసిసి జాయింట్‌ సెక్రటరీలు అబ్దుల్లా షరీఫ్‌,  ఎస్‌.కె.జిలానీ, ఉసురుమర్తి ఆనంద్‌, స్టేట్‌ సేవాదళ్‌ ఆర్గనైజర్‌ గోలి రవి, సిటీ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కొవ్వూరి శ్రీనివాస్‌,  నగర కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ కూనపరెడ్డి శ్రీనివాస్‌, స్టేట్‌ లింగ్విస్టిక్‌ సెల్‌ చైర్మన్‌ కిశోర్‌కుమార్‌ జైన్‌,  నగర ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షులు గట్టి నవ తారకేష్‌, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.నందు, బిసి సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ కె.కుమారి, సిటీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎన్‌.పార్వతి, సిటీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు బేరి మోహిత్‌, జిల్లా ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్‌, రెడ్డి రామ్‌కుమార్‌, నలమాటి శ్యామ్‌, పట్టాభి, రాజశేఖర్‌, ఉమాకాంత్‌, కోటి పాల్గొని దేశానికి ఇందిర చేసిన సేవలను కొనియాడారు. భావితరాలకు ఇందిర ఆదర్శప్రాయులని పేర్కొన్నారు.