27న విశ్వబ్రాహ్మాణుల కార్తీక వన సమారాధన 

0
65
రాజమహేంద్రవరం, నవంబర్‌ 24 : రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27న మధురపూడి విమానాశ్రయం సమీపంలోని పొన్నాడ బ్రహ్మానందం తోటలో విశ్వ బ్రాహ్మణ కార్తీక వనసమారాధన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ గౌరవ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా తెలంగాణా అసెంబ్లీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, ఎంపి మాగంటి మురళిమోహన్‌, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, పెందుర్తి వెంకటేష్‌, మేయర్‌ పంతం రజనీ శేషసాయి,ఎమ్మెల్సీలు ఆదిరెడి ్డ అప్పారావు,  సోము వీర్రాజు, రెడ్డి సుబ్రహ్మణ్యం, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు తదితరులు హాజరవుతారని  పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశ్వ బ్రాహ్మణులకు రాజకీయ పార్టీలు గుర్తింపు ఇవ్వడం లేదని, ఓటు బ్యాంక్‌గా వినియోగించుకుంటున్న తమకు  ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఏర్పాటు చేశారని, ఒక ఎమ్మెల్సీ పదవిని విశ్వ బ్రాహ్మణులకు ఇవ్వాలని కోరారు. విలేకరుల సమావేశంలో సంఘ నాయకులు అనుపోజు వెంకటరమణ, గుంటముక్కల రాజు, పొడుగు శ్రీను (గాడాల), తాళాబత్తుల భాస్కరరావు,  దేవగుప్తాపు శ్రీనివాస్‌, అడ్డూరి వెంకట్‌ ముత్యం, చిప్పాడ నాగశ్యామ్‌, గున్నాబత్తుల ఉమా మహేశ్వరరావు, బ్రహ్మాజీ ఎర్రగొండ  సూరిబాబు, గుంటముక్కల అఖిల్‌, పెదగాడ సూరాచార్యులు పాల్గొన్నారు.