28న బిసి కులాల ప్రతినిధుల సమావేశం 

0
66
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 26 : బిసి రౌండు టేబుల్‌ సమావేశం నగర బిసి సంఘం అధ్యక్షుడు మజ్జి అప్పారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మజ్జి అప్పారావు మాట్లాడుతూ ఈనెల 28న మంజునాధా కమిషన్‌ కాకినాడ విచ్చేస్తుందని పురస్కరించుకుని రాష్ట్ర జెఏసీ చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు వై-జంక్షన్‌లో ఆనం రోటరీ హాలులో బిసి కులాల ప్రతినిధులు, బిసి అభిమానులు అందరూ పాల్గొని సలహాలు, సూచనలు ఇవ్వాలని, అలాగే బిసి లందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని మజ్జి అప్పారావు కోరారు. ఈ సమావేశంలో మార్గాని రామకృష్ణ గౌడ్‌, దుర్గా యాదవ్‌, ఇమంది కన్నారావు, ఎం.డి.మున్నా, దొమ్మేటి సోమశంకరరావు,  మజ్జి రాజీవ్‌గాంధీ పాల్గొన్నారు.