వైద్యరత్న డా.శంకరశెట్టి కొండలరావుకి నివాళి

0
38
రాజమహేంద్రవరం, నవంబర్‌ 26 :  వైద్యరత్న డా.శంకరశెట్టి కొండలరావుకు ఆంధ్రప్రదేశ్‌ దేశీయ వైద్య సంఘం నివాళులర్పించింది. కాకినాడలోని డాక్టర్‌ కొండలరావు బుధవారం మృతి చెందారు.  దేశీయ వైద్య సంఘ అధ్యక్షులుగాను, అన్నవరం దేవస్థానం ఆస్థాన వైద్యులుగాను, అనుభూత్‌ యోగ సంఘ సంస్థాపకులుగాను, సూర్యసిద్ధ విద్యాపీఠం ఆచార్యులుగాను అనేక బాధ్యతలు నిర్వర్తించి, అనేకమంది శిష్యులను తీర్చిదిద్ది అసాధ్య రోగాలను కూడా అతి చిన్న అనుభవ యోగాల ద్వారా నయం చేయడంలో ఆయన సమర్ధత చూపారన్నారు. సంఘ కార్యాలయంలో దేశీయ వైద్య సంఘ ప్రధాన కార్యదర్శి డా.ఆకాశం గౌరీష్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో డాక్టర్‌ కొండలరావు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులర్పించింది. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్‌ అడ్డాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి డా.ఆకాశం గౌరీష్‌బాబు, సంయుక్త కార్యదర్శి డా.సబ్బిన శ్రీనివాసరావు, కోశాధికారి డా.శెట్టి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు డా.రామేన ఆదినారాయణ, డా.ఎం.ఆర్‌.కె.రావు, ఎ.ప్రసాద్‌ పాల్గొన్నారు.