లెక్క లెక్కే

0
120
నోట్లు రద్దయినా చెప్పి తీరాల్సిందే
 
రైల్వే పోలీసుల అదుపులో చెన్నై వాసి – రూ. 50 లక్షల స్వాధీనం
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 25 : పెద్ద నోట్లు చెల్లకుండా పోయాయని పెద్ద మొత్తంలో వెంట పెట్టుకుని తిరిగితే కుదరదు మరి! అంత మొత్తం ఎలా వచ్చిందో ఆదాయ పన్ను అధికారులకు లెక్కలు చెప్పవలసిందే. గోదావరి రైల్వే స్టేషన్‌లో ఈరోజు సరిగ్గా ఇదే జరిగింది. ఈరోజు ఉదయం చెన్నై నుంచి బొకారో ఎక్స్‌ప్రెస్‌లో గోదావరి  రైల్వే స్టేషన్‌లో దిగిన చెన్త్నెకు చెందిన మబి అళగన్‌ అనే వ్యక్తిని  గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు, కష్టమ్స్‌ సిబ్బంది అదుపులోకి తీసుకుని అతని వద్ద బ్యాగ్‌లో ఉన్న రూ. 50 లక్షల రద్దయిన వేయి నోట్లను  స్వాధీనం చేసుకున్నారు. చెన్న్తెకు చెందిన ఓ వ్యాపారి ఈ డబ్బును రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యక్తికి ఇవ్వాలని  సూచించడంతో మబి అళగన్‌ వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌ రాజమహేంద్రవరం విభాగం డిఎస్పీ లక్ష్మీనారాయణ, కష్టమ్స్‌ సూపరింటెండెంట్‌  పి.పాండురంగారావు, ఇతర సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు.