ఉత్తమ శిక్షణార్థిగా అర్బన్‌ ఎస్పీ  రాజకుమారి 

0
93
రాజమహేంద్రవరం, నవంబర్‌ 26 : దేశ  వ్యాప్తంగా ఐపీఎస్‌లకు జరిగిన మిడ్‌టర్మ్‌ కెరీర్‌ శిక్షణలో పాల్గొన్న అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారికి ఉత్తమ శిక్షణార్ధిగా గుర్తింపు లభించింది. ఈ నెల 2 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగిన  శిక్షణలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 77 మంది ఐపీఎస్‌లు పాల్గొన్నారు. ఈ శిక్షణ లో పాల్గొన్న ఆమె తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ తదితర దేశాల నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులతో శిక్షణ ఇచ్చారన్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ పోలీసింగ్‌, నాయకత్వ లక్షణాలు, భద్రతలో మారుతున్న వ్యవస్థాపకరమైన మార్పులు, ట్రాఫిక్‌ నిర్వహణ తదితర అంశాల్లో విదేశీ నిపుణులు వివరించారన్నారు. దాడులు, విపత్తులు సంభవించినపుడు బాధితులను ఏ విధంగా గుర్తించి రక్షించాలనే అంశాలపై సమగ్ర చర్చలు, నేర్చుకున్న అంశాలపై పర్షీలు, ప్రాజక్ట్‌ రిపోర్టులు శిక్షణలో ఉన్నాయన్నారు. రాష్ట్రం నుంచి అర్బన్‌ ఎస్పీ రాజకుమారితో పాటు గుంటూరు ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గ్రేహౌండ్స్‌ నుంచి రఘరామిరెడి హాజరయాయ్యన్నారు.