జాతీయ స్థాయి టిటి పోటీలకు  అర్హత సాధించిన ఆచంట ఉమేష్‌

0
40
రాజమహేంద్రవరం, నవంబర్‌ 28 : వచ్చే నెల 2 నుంచి ఆరవ తేదీ వరకు  ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగే జాతీయ పోస్టల్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్షిప్‌ పోటీలకు రాజమహేంద్రవరం హెడ్‌ పోస్టాఫీస్‌లో పనిచేస్తున్న ఆచంట ఉమేష్‌ ఎంపికయ్యారు. గత నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికైన ఉమేష్‌ ఇపుడు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఉమేష్‌ను తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ అభినందించారు. వరుసగా ఎనిమిది పర్యాయాలు జాతీయ స్థాయిలో సిల్వర్‌ పతకాలను సాధించిన ఉమేష్‌ ఈ పర్యాయం గోల్డ్‌ మెడల్‌ సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. ఈ  సందర్భంగా ఉమేష్‌ మాట్లాడుతూ తనను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తెదేపా నాయకులు గన్ని కృష్ణకు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు, ఏపీటిటిఏ  ప్రెశిడెంట్‌ వి.భాస్కరరామ్‌కు, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ కోచ్‌ వి .టి. వి. సుబ్బారావులకు కృతజ్ఞతలు తెలిపారు.