ద్వార రామకృష్ణకు సతీవియోగం

0
44
రాజమహేంద్రవరం, నవంబర్‌ 28 : రాజమండ్రి టింబర్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు,  దేవాంగ ప్రముఖుడు ద్వారా రామకృష్ణ సతీమణి సత్యవతి (61 సం||లు) సోమవారం ఉదయం స్థానిక జాంపేట గొబ్చకవీధిలో ఆమె స్వగృహంలో మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. నగర దేవాంగ సంఘం ప్రధాన కార్యదర్శి కాలెపు సత్యనారాయణ మూర్తి, జాంపేట దేవాంగ ప్రముఖులు పలువురు ఆమె భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. స్థానిక కోటిలింగాలకైలాస భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు.