రూరల్‌లో గోరంట్ల మోటర్‌ సైకిల్‌ ర్యాలీ 

0
95
రాజమహేంద్రవరం, నవంబర్‌ 28 :  రూరల్‌ నియోజకవర్గం పిడింగొయ్యి గ్రామంలో ఈరోజు నిర్వహించిన తెదేపా జన చైతన్య యాత్రలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మోటర్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి క్యాడర్‌లో ఉత్సాహం నింపారు. జైహిందూ నగర్‌, గంగిరెడ్ల కాలనీ, అరవింద్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాటిలైట్‌ సిటీ గ్రామంలోని జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో  ఆకస్మిక తనిఖీలు చేశారు. తరగతి గదులను,మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుని పరిశీలించారు. సీఎం చంద్రబాబునాయుడు శాటిలైట్‌సిటీపై ప్రత్యేక దృష్టి సారించారని,  ఏ విషయంలో రాజీ పడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్ని వాసుదేవ్‌, రేలంగి సత్యనారాయణ, బొప్పన నాగేశ్వరరావు, మార్ని దొరబ్బాయ్‌,మార్ని చౌదరి,మత్స్యేటి ప్రసాద్‌, దారా అన్నవరం,ముసిన శ్రీను, కుడుపూడి సత్యనారాయణ, బండారు సత్తిబాబు, ఎమ్మెస్సార్‌ శ్రీను, కోటి పాల్గొన్నారు.