గోదావరిలో మంగళంపల్లి బాలమురళి అస్థికలు నిమజ్జనం 

0
61
రాజమహేంద్రవరం, నవంబర్‌ 28 : సంగీత ప్రియులకు ఇక సెలవంటూ దివికేగిన సంగీత సమ్రాట్‌ పద్మవిభూషణ్‌ డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అస్థికలను పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు ఆయన కుటుంబసభ్యులు ఈరోజు నగరానికి వచ్చారు. స్ధానిక కోటిలింగాలపేటలోని పందిరి మహదేవుడు కోటిలింగాల సత్రంలో ఆయన అస్థికల కలశాన్ని ఉంచినపుడు పలువురు సంగీత ప్రియులు ఘనంగా నివాళులర్పించారు. బాలమురళీకృష్ణకు గోదావరి తీరమన్నా, రాజమహేంద్రవరం నగరమన్నా ప్రత్యేక అభిమానం ఉండటంతో ఆయన అస్థికలను ఇక్కడకు తీసుకొచ్చి  శాస్త్రోక్తంగా విధులు నిర్వహించి నదిలో నిమజ్జనం చేశారు.