వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవాల్లో అఖండ దీపారాధన

0
118
రాజమహేంద్రవరం, నవంబర్‌ 29 : శ్రీశ్రీశ్రీ విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద స్వామి వారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కెవిఆర్‌ స్వామి రోడ్డులో అఖండ దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్యురాలు డా.నీలిమా అగర్వాల్‌, వ్యాపారవేత్త ఇయ్యపు మురళీధర్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ కో ఆర్డినేటర్‌  ఆకుల వీర్రాజు, కార్పొరేటర్లు బొంత శ్రీహరి, పాలవలస వీరభద్రం, స్వర్ణకార సంఘ పెద్దలు, సువర్ణ వర్తక సంఘం నాయకులు, సిల్వర్‌ జ్యుయలరీ వర్కర్స్‌ యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా వచ్చే నెల 4న అన్నదానం నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్‌ ముసినాడ సాగర్‌ తెలిపారు.