దుర్గేష్‌కు దన్ను  – రూరల్‌లో కాంగ్రెస్‌ నేతల రాజీనామాలు

0
41
రాజమహేంద్రవరం, నవంబర్‌ 29 : రూరల్‌ నియోజకవర్గంలోని హుకుంపేట, పిడింగొయ్యి గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు పార్టీకి, సభ్యత్వాలకు రాజీనామా చేశారు. పిఏసిఎస్‌ డైరెక్టర్లు సప్పా చిన్నారావు, బొడ్డు వెంకటేశ్వర్లు, కురుమళ్ళ సూర్యకుమార్‌, హుకుంపేట మాజీ ఉప సర్పంచ్‌ చిక్కాల బాబులు, చుండ్రు బ్రహ్మాజీ, నాగేంద్ర, కామిరెడ్డి వీరబాబు, ఇంటి తాతాజీ, మైనార్టీ నాయకులు ఎస్‌.కె.మీరావల్లి, ఎస్‌.కె.జిన్నా, ఎస్‌.కె.ఇస్మాయిల్‌, ఎస్సీ సెల్‌ నాయకులు మాండ్రు రవి, కొడమంచిలి వెంకట్రావు, కందుకూరి సుబ్రహ్మణ్యం, మాచారపు నూకరాజు, ఆకుమర్తి చిన్నారి, మేడి త్రిమూర్తులు, పడాల వీర రాఘవరెడ్డి, కవులూరి చంటిబాబు, పిల్లా లక్ష్మణ్‌, కందిరెల్లి సత్యనారాయణ, సిడగం రామారావు, మండ్ల బంగార్రాజు, గొంతిని సత్యనారాయణ, వానపల్లి సత్యనారాయణ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరిలో కందుల దుర్గేష్‌కు మద్దతు తెలియజేస్తూ ఆయన వెంట పయనించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే దుర్గేష్‌ కాంగ్రెస్‌ పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి  రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.