అణగారిన వర్గాలకు జీవితాన్ని ధారపోసిన జ్యోతిరావు ఫూలే  

0
122
రాజమహేంద్రవరం, నవంబర్‌ 29 : మహత్మా జ్యోతిరావ్‌ ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి అర్బన్‌ జిల్లా బిసి సంక్షేమ సంఘం ఘనంగా నివాళులు అర్పించింది. తొలుత సంఘం అధ్యక్షులు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ముఖ్య అతిధిగా పాల్గొన్న బిసి సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు. నగర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు మజ్జి అప్పారావు మాట్లాడుతూ  జ్యోతిరావు ఫూలే నిర్ధేశించిన మార్గంలోనే బిసి నాయకులంతా పయనించాలని అన్నారు. అణగారిన వెనుకబడిన వర్గాల వారికి హక్కుల గురించి నేతలు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యారి ్ధ నాయకుడు దుర్గా యాదవ్‌, మార్గాని రామకృష్ణ గౌడ్‌, ఇమ్మంది కన్నారావు, ఎండి మున్నా, దొమ్మేటి సోమశంకరరం, దీపు, గాంధీ తదితరులు పాల్గొన్నారు.