కుల ప్రాతిపదిన వద్దు – పేదరికమే హద్దుగా రిజర్వేషన్లు

0
67
20న కిర్లంపూడికి ఆర్పీసి పాదయాత్ర : మేడా శ్రీనివాస్‌
రాజమహేంద్రవరం, నవంబర్‌ 29 : రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ” కుల రిజర్వేషన్‌ వద్దు – పేదరికం ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఇవ్వాలి” అనే నినాదంతో వచ్చే నెల 20 వ తేదీన కిర్లంపూడికి పాదయాత్ర చేపడుతున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ తెలిపారు. తమ పార్టీ డిమాండ్‌ను కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి వివరిస్తామని, ఆయనతో పాటు బిసి సంఘాలు, దళిత క్రైస్తవులను కూడా కలుస్తామన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ కులపరమైన రిజర్వేషన్ల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, పేదరికం పె రుగుతూనే ఉందన్నారు.పేదరికం లేని సమ సమాజాన్ని నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని , అందులో భాగంగా వచే ్చ నెల 20 నుంచి పాదయాత్ర చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో కొంతమంది కుల సంఘాల నాయకులు ఉనికి కోసం ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు.  ముద్రగడతో  సినీ నటుడు మోహన్‌బాబు  భేటీ కావడం వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో తెలియాల్సి ఉందన్నారు. తమ యాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరామని, అనుమతి లేకుంటే ప్రత్యామ్నయ ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. విలేకరుల సమావేశంలో పెండ్యాల కామరాజు, డి వీ రమణమూర్తి, ఆర్‌.కె.చెట్టి, ఖండవల్లి భాస్కర్‌, లంక దుర్గాప్రసాద్‌, కొత్తపల్లి భాస్కరరామ్‌, కెవైవి సత్యనారాయణ, ద్వాదశి శ్రీనివాస్‌, కారుమూరి రామచంద్రుడు, బర్ల దుర్గాప్రసాద్‌, కొల్లి సిమ్మన్న, మిథిన్‌, కాకి ఈశ్వర్‌, దుడ్డే త్రినాధ్‌, సత్తి వెంకటరెడ్డి పాల్గొన్నారు.