వెంకయ్య మతిలేని మాటలు

0
141
వర్గీకరణకు ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాం : మాల మహానాడు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 29 : ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మతి తప్పి మాట్లాడుతున్నారని, వర్గీకరణ చేసి తీరుతామంటూ వ్యాఖ్యలు చేస్తే  ఆయనను మాల మహానాడు ప్రతిఘటిస్తుందని మాజీ కార్పొరేటర్‌, మాల మహానాడు నాయకులు అజ్జరపు వాసు హెచ్చరించారు.  వర్గీకరణను బలపరుస్తూ వెంకయ్య వ్యాఖ్యలను నిరశిస్తూ గోకవరం బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఈరోజు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ అన్నదమ్ముల్లా కలిసున్న దళితులను రాజకీయ ప్రయోజనాల కోసం వెంకయ్యనాయుడు లేవనెత్తారని మండి పడ్డారు. పెద్ద నో ట్ల రద్దుతో ప్రజాదరణ కోల్పొయిన బిజెపి ఇపుడు కులాలను రెచ్చగొట్టే పనిలో నిమగ్నమైందన్నారు. వర్గీకరణ ఊసెత్తితే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరి ంచారు.  ఈ  కార్యక్రమంలో యు.రాజారావు, తాళ్ళూరి బాబూ రాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి, బొచ్చా రమణ, విజ్జిన మధు, గారా చంటిబాబు, కుమార్‌, రేపాక నాగేశ్వరరావు, సత్తిబాబు, మోర్త పోతురాజు, మాండ్రు రామకృష్ణ, బత్తిన చక్రరావు, రాజు, ప్రసన్న, బుజ్జి, నేదునూరి రాజు పాల్గొన్నారు.