యూనివర్శిటీ క్రీడా పోటీల్లో విటి విద్యార్ధుల ప్రతిభ 

0
48
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : ఆదికవి నన్నయ యూనివర్శిటీ  పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో తమ కళాశాల విద్యార్ధులు పలు బహుమతులను సాధించారని ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌  పి.శ్రీరామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తణుకులో జరిగిన టిటి మెన్‌ టోర్నమెంట్‌లో తమ కళాశాల టీమ్‌ బహుమతులు సాధించిందని ఆయన తెలిపారు. యూనివర్శిటీ టీమ్‌ నుంచి ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్శిటీ సౌత్‌ జోన్‌లో ప్రథమ సంవత్సరం బి.కాం విద్యార్ధి సిహెచ్‌.రామచరణ్‌ తేజ, టిటి ఉమెన్‌ విభాగంలో టి. అనునయ, వైఎస్‌డికె వెంకటేష్‌ పాల్గొంటారు. జాతీయ స్థాయిలో  యూనివర్శిటీ టీమ్‌తో  వీరు పాల్గొంటారని కళాశాల పి.టి. కిషోర్‌బాబు తెలిపారు.