చేనేతోద్యమంలో ప్రగడ కోటయ్య పాత్ర చిరస్మరణీయం 

0
89
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : చేనేత రంగ పితామహుడు ప్రగడ కోటయ్య 21 వ వర్థంతి ఇటీవల తుమ్మలావలోని పద్మశాలీయ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగింది. సంఘ అధ్యక్షులు జామిశెట్టి గాంధీ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేతోద్యమంలో కోటయ్య ప్రశంసనీయమైన పాత్ర వహించారని అన్నారు. కోటయ్య వర్థంతి కార్యక్రమ కన్వీనర్‌ చిందం రాధాకిషన్‌ మాట్లాడుతూ ఆ రోజుల్లో ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో చేనేతోద్యమం వేలాది మందితో కదం తొక్కించిన  మహానేతగా అభివర్ణించారు. తొలుత కోటయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇమంది కన్నారావు, బొజ్జా  సన్యాసిరావు, స్వర్ణపూడి  వెంకటరమణ, నీలం శ్రీరామప్పారావు పాల్గొన్నారు.