బ్రాహ్మణ వృద్ధుల పింఛన్‌ పథకం గడువు పొడిగింపు

0
56
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 :  బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా విడుదల చేసే బ్రాహ్మణ వృద్ధుల పింఛన్ల మంజూరుకు దరఖాస్తు చేసుకునే గడువు డిసెంబర్‌ నెలాఖరు వరకు పొడిగించినట్లు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాదిరాజు శ్రీనివాస్‌ తెలిపారు. గడువు పొడిగించాలని విజయవాడలో కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావును కలిసి సమాఖ్య ప్రతినిధులు కోరగానే సానుకూలంగా స్పందించారన్నారు. 60 ఏళ్ళకు పైబడిన బ్రాహ్మణ వృద్ధులంతా ఈ పింఛన్‌ పథకంలో నెలకి రూ.వెయ్యి పొందే అవకాశం ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ పథకానికి 60 ఏళ్ళ బ్రాహ్మణ వృద్ధులు వయస్సుతో నిమిత్తం లేకుండా వితంతువులు, వికలాంగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు కుల ధృవీకరణ పత్రాలు పొందాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9989951640 సెల్‌ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.