రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన రజనీష్‌రెడ్డి  

0
100
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు కల్పించవలసిన సౌకర్యాలను మరింత మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తానని దక్షిణ మధ్య రైల్వే యూజర్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ మెంబర్‌ డా. చింతకుంట రజనీష్‌రెడ్డి చెప్పారు. ఈరోజు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. స్టేషన్‌ మేనేజర్‌ భమిడిపాటి సుబ్రహ్మణ్యశాస్త్రితో కలిసి పలు విభాగాలను పరిశీలించి  మెరుగైన వసతుల కల్పనకు సూచనలు, సలహాలు తీసుకున్నారు. వచ్చే నెల 20 న జరగనున్న జెడ్‌ఆర్‌ఇసిసి సమావేశంలో పలు అంశాలను ప్రస్తావిస్తానన్నారు.