కార్తీకమా…వెళ్ళి రావమ్మ….

0
102
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఈరోజు గోదావరి నదిలో  పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. నెలరోజులుగా కార్తీక మాసం పుణ్య స్నానాలు, పూజలు నిర్వహించిన భక్తులు ఈరోజు పోలిని స్వర్గానికి పంపే కార్యక్రమంతో కార్తీకానికి ముగింపు పలికారు. ఈ సందర్భంగా  చలిని సైతం లెక్కచేయకుండా వేకువజాము నుంచే వివిధ స్నాన ఘట్టాల్లో భక్తులు ముఖ్యంగా మహిళలు పుణ్య స్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలను విడిచిపెట్టారు.