ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమికొడదాం

0
102
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 1 :  ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమి కొట్టాలని పలువురు పిలుపు ఇచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా  ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి నుంచి  కంబాలచెరువు వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు.  ప్రపంచ ఎ యిడ్స్‌ దినోత్సవం సందర్భంగా సేఫ్‌ సర్వీసెస్‌  స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వై జంక్షన్‌లో విద్యార్ధులతో ర్యాలీ నిర్వహించారు. చేయి చేయి కలుపుదాం..ఎయిడ్స్‌ను నిర్మూలిద్దాం అంటూ నినదించారు.   అనంతరం ఎయిడ్స్‌ భూతాన్ని దగ్ధం చేశారు.ఈ సందర్భంగా సేఫ్‌ సంస్థ అధ్యక్షులు తలారి భగవాన్‌ మాట్లాడుతూ  ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రచారాన్ని ఉధృతం చేసి  అవగాహన పెంచాలన్నారు.  ఈ కార్యక్రమంలో క కార్టునిస్టు శేఖర్‌, సేఫ్‌ సంస్థ సభ్యులు  పి.వసంతకుమార్‌, ముళ్ళ నాగేశ్వరరావు,  పెద్దబాబు, మట్టాడి శ్రీను, సాయి ప్రసాద్‌, చున్నీలాల్‌ జాజు పాఠశాల ఉపాధ్యాయులు పి.బుచ్చిబాబు, జీవిఎస్‌ శంకర్‌నారాయణ, అప్పయ్యశాస్త్రి, వంగల శేఖర్‌,   వ్యాయామ ఉపాధ్యాయురాలు హవీలా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభో త్సవానికి ముందు ఉపాధ్యాయురాలు బి.రత్నాంబ, హెచ్‌ఐవి – ఎయిడ్స్‌పై విద్యార్ధులతో ప్రదర్శించిన నాటిక  అందరినీ ఆలోచింపజేసింది.