మహిళాభివృద్ధికి స్వర్ణాంధ్ర కృషి అభినందనీయం

0
60
43వ బ్యాచ్‌ విద్యార్ధినులకు ఓఎన్జీసీ బి. ప్రసాదరావుచే ఉత్తీర్ణత పత్రాలు అందజేత
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 2 : మహిళలు అన్ని రంగాలలో రాణించడానికి తగు సహకారం అందిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సంస్థ సేవలు ఆదర్శనీయమని ఓఎన్జీసీ ఉద్యోగుల సంఘం అఖిలభారత చైర్మన్‌ బి. ప్రసాదరావు అన్నారు.   గురువారం మధ్యాహ్నం స్థానిక లాలాచెరువు స్వర్ణాంధ్ర మహిళల ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం 43వ బ్యాచ్‌ ముగింపు ఉత్సవానికి ప్రసాదరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉపాధితో పాటు స్వయం వృద్ధికి కుట్టు శిక్షణ తోడ్పడుతుందని, ఉపయోగపడుతుందని అందుకు కావల్సిన సహకారం ఓఎన్జీసీ నుంచి అందిస్తామన్నారు. ఈ సమావేశానికి స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్‌ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. 43వ బ్యాచ్‌లో ఉత్తీర్ణులైన 18 మందికి ఉత్తీర్ణత పత్రం, జ్ఞాపికను ప్రసాదరావు చేతుల మీదుగా అందించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు 3650 మంది శిక్షణ పొందారని, దీనిలో 36 మంది ప్రభుత్వ పాఠశాలలో కుట్టు టీచరుగా పనిచేస్తుండగా 2వేల మంది కుట్టు మీద ఆధారపడి జీవన అభివృద్ధి పొందుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఓఎన్జీసీ ఉద్యోగ సంఘం నాయకులు ఎన్‌. కన్నెరాజు, ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు పి. బి. రాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి, కుట్టు టీచర్‌ వై. శశికళ, స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షులు భరణి, పులిదిండి ప్రసాద్‌, శిక్షణ పొందిన పూర్వపు విద్యార్ధినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ జాతీయ చైర్మన్‌ పి. ప్రసాదరావును, కన్నెరాజును స్వర్ణాంధ్ర తరుపున దుశ్శాలువతో సత్కరించారు.